* పౌరసంఘాల నాయకుల డిమాండ్
* 11న ఏకశిలా పార్క్ వద్ద నిరసన దీక్ష
ఆకేరు న్యూస్,హనుమకొండ : గత పాలకులు వరంగల్ మహా నగరాన్ని రెండు ముక్కలు సమగ్ర అభివృద్ధిని విధ్వంసం చేశారని పౌరసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మళ్లీ యధావిధిగా రెండుగా విభజించిన వరంగల్ జిల్లాను మళ్లీ ఏకం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న హనుమకొండలోని బాలసముద్రంలో ఉన్న ఏకశిలా పార్కువద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.నగర వాసులు పెద్దెత్తున నిరసన దీక్షలో పాల్గొనాలని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన దీక్షలో ప్రొఫెసర్ కూరపాటి నారాయణ ,పుల్లూరి సుధాకర్ తదితరులు పాల్గొననున్నారు.

