* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి సర్కార్ సంక్షోభంలోకి నెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థుల మరణించారని.. ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని తెలిపారు. పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడని.. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని విమర్శించారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించని ప్రభుత్వానికి ఉసురు తప్పదన్నారు.
………………………………….