* 361 బస్సులపై కేసులు
* ఏపీలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
ఆకేరు న్యూస్, అమరావతి : కర్నూలు ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణ శాఖను ఆదేశించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ట్రావెల్ బస్సుల తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న రవాణ శాఖ అధికారులు తనిఖీల కొనసాగుతున్నాయి. సేఫ్టీ పాటించకపోవడం, నిబంధనలకు మించి సీటింగ్, ఫిట్ నెస్ లేకపోవడం వంటి కారణాలతో 40 ట్రావెల్ బస్సులను సీజ్‌చేశారు. ఈ తనిఖీలు రాష్ట్రమంతా జరుగుతున్నాయి. అలాగే 361 ట్రావెల్ బస్సుల యజమానులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్నాయి. జడ్చర్ల వద్ద అద్దం పగిలిపోయినా నడుపుతున్న ఒక ట్రావెల్ బస్సును కూడా సీజ్ చేశారు. అధికారులు ప్రయాణికులకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేవారు ఆ బస్సు రివ్యూలు, రేటింగ్‌లు చూసుకొని, ట్రావెల్స్ గత చరిత్రను తెలుసుకుని ప్రయాణించాలని సూచించారు.
……………………………………..
