* ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 17 నుంచి ఐదురోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని.. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు పాల్గొన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
