ఆకేరున్యూస్, అమరావతి: ఏపీలోని రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ, ముంబాయి విమాన సర్వీస్ గురువారం నుంచి ప్రారంభమయ్యింది. ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్‌పోర్టుకు మొదటిసారిగా వచ్చిన ఇండిగో ఎయిర్‌బస్‌లో కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు, పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి రాజమండ్రికి వచ్చారు. ఈ సందర్భంగా విమానానికి వాటర్ కెనాన్లతో సిబ్బంది స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంతకుముందు ఢిల్లీకి, విదేశాలకు వెళ్లాలంటే విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌కు వెళ్లాల్సివచ్చేదని.. ఇకపై ముంబాయి, ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లవచ్చని తెలిపారు. అలాగే భవిష్యత్‌లోనూ తిరుపతి, షిర్టీ, జైపూర్, గుజరాత్ రాష్ట్రాలకు, ప్రధాన నగరాలకు బిజినెస్ కనెక్టివిటీని పెంచడానికి అవకాశముందన్నారు.
………………………………..