* రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు(MANCHI MOHANBABU) కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కొద్ది రోజులుగా కుటుంబంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందారు. హైబీపీ(HIGH BP), నరాల నొప్పులతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత డిశ్చార్జి అయ్యారు. వాస్తవానికి ఆయన సీపీ(CP) ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే.. కోర్టు(COURT) ఉత్తర్వుల మేరకు ఈ నెల 24 వరకు ఆయనకు మినహాయింపు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
…………….