* ఉద్యోగుల గైర్హాజరుపై మంత్రుల ఆగ్రహం
* ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ అమలులోకి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఫేస్ రికగ్నిషన్కు సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఫేషియల్ రికగ్నేషన్ విధానంపైనే రోజువారి అటెండెన్స్ నమోదు చేయనున్నారు. గురువారం నుంచి అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఇది వర్తిస్తోంది.
……………………………….