* రష్యన్ భాషలో మెయిల్
* అప్రమత్తమైన పోలీసులు
ఆకేరున్యూస్, ముంబై: దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈమెయిల్ ఐడీకి రష్యన్ భాషలో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
………………………………..