ఆకేరున్యూస్, హైదరాబాద్: భూదాన్ భూముల వ్యవహారంలో ఓ మాజీ ఎమ్మెల్యే సహా నలుగురుకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను ఈడీ ఇప్పటికే విచారించగా.. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. ఐఏఎస్ అమోయ్‌కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఇదే సర్వేనంబర్‌లోని ప్రైవేట్ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్‌ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
