* సోనియాగాంధీ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఇటీవల ఎంపీగా గెలిచిన ప్రియాంకాగాంధీ.. ఇవాళ లోక్సభలో తొలిసారి ప్రసంగించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. అనంతరం పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న సోనియాగాంధీని.. ప్రియాంకాగాంధీ ప్రసంగంపై మీ అభిప్రాయం ఏమిటని మీడియా ప్రశ్నించారు. దీంతో ప్రియాంకాగాంధీ చేసిన తొలి ప్రసంగాన్ని సోనియాగాంధీ మెచ్చుకున్నారు. ఎక్సలెంట్ అన్నారు.
…………………………………………………..