* కామన్ డైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
* విద్యార్థులతో కలిసి భోజనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) ప్రకటించారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతే బాధ్యత ఎవరిదని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంతో మంది గురుకులాల్లో చదివే ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని టీజీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(SOCIAL WELFARE RESIDENTIAL SCHOOL)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి సిఎం భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతినెలా 10న గురుకులాలు, హాస్టల్స్ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గ్రీన్‌ఛానల్(GREEN CHANNEL) ద్వారా నేరుగా అకౌంట్లలో జమ చేస్తామని తెలిపారు. ఇకపై ప్రతినెలా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. గురుకులాలు, హాస్టల్స్‌ను విధిగా పరిశీలిస్తారని చెప్పారు. విద్యార్థుల్లో స్కిల్స్ కోసం టాటాగ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు చెప్పిన సీఏం.. 75 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. ఐటీఐలో చేరితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం కల్పిస్తామని రేవంత్ వివరించారు.
…………………………………………