ఆకేరున్యూస్, శ్రీశైలం: శ్రీశైలంలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి భయపడగా.. మరికొందరు రోడ్డుపై కూర్చున్న చిరుతపులిని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
………………………………..