* సంథ్య థియేటర్ ఘటనపై చర్చ.. అక్కడే లంచ్
* అరవింద్ ఇంటికి పవన్ కల్యాణ్?
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంటికి చేరుకున్నారు. సంథ్య థియేటర్ ఘటన, బన్నీ అరెస్ట్.. బెయిలు, తదుపురి న్యాయ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. సంథ్య థియేటర్ వద్ద తొక్కిలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ను (Hero Allu Arjun Arrest) పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో టాలీవుడ్ అంతా బన్నీ అండగా నిలిచింది. మెగా ఫ్యామిలీ(Mega Family), అల్లు ఫ్యామిలీ(Allu Family) మధ్య మనస్ఫర్థలు ఉన్నాయని కొంత కాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ బన్నీ అరెస్ట్ తెలిసిన వెంటనే విశ్వంభర షూటింగ్‌ను చిరంజీవి క్యాన్సల్ చేసుకున్నారు. సతీమణితో కలిసి అల్లు ఇంటికి వెళ్లి పరామర్శించారు. బన్నీ విడుదలలోనూ కీలక పాత్ర పోషించారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. కాగా, అల్లు అర్జున్ రిలీజ్ విషయంలో సింహభాగం పోషించిన చిరంజీవిని కలిసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడ చిరు ఫ్యామిలీతో కలిసి లంచ్ చేసినట్లు తెలిసింది. ఇదిలాఉండగా.. అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan)ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిసింది. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
……………………………….