* దర్యాప్తు కొనసాగుతోంది
* సీపీ సుధీర్ బాబు
ఆకేరున్యూస్, హైదరాబాద్: మోహన్‌బాబు, మంచు మనోజ్ వివాదంలో ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఎక్కడ ఆలస్యం లేదని స్పష్టం చేశారు. ఆయన వద్ద మెడికల్ రిపోర్ట్ తీసుకోవాలని పేర్కొన్నారు. మోహన్‌బాబుకు నోటీస్ ఇచ్చామని.. ఈ నెల 24వరకు సమయం అడిగారన్నారు. 24వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టు కూడా మోహన్ బాబుకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. రాచకొండ పరిధిలో మోహన్ బాబుకు ఎలాంటి గన్ లైసెన్స్ లేవని.. మోహన్ బాబు వద్ద రెండు గన్స్ ఉన్నాయన్నారు. మోహన్ బాబుకు మరోసారి నోటీస్ ఇస్తామని.. నోటీసులకు స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని సీపీ పేర్కొన్నారు.
………………………………………