* ఓ బాలుడికి అస్వస్థత.. జికా వైరస్ అని అనుమానం
* చెన్నయ్‌కు బాలుడికి తరలింపు
ఆకేరు న్యూస్, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా(Nellore District)లో జికా వైరస్ కలకలం రేపుతోంది. వెంకటాపురానికి చెందిన ఆరేళ్ల బాలుడు అస్వస్థతకు గురికావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు జికా వైరస్(Zika Virus) సోకినట్లు అనుమానిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాలుడిని చైన్నయ్‌లోని ప్రత్యేక ఆస్పత్రికి తరలించారు. వెంకటాపురం(Venkatapuram)లో జిల్లాలో వైద్య బృందం పర్యటిస్తోంది. వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అనుమానం మాత్రమేనని వైద్యులు పేర్కొంటున్నారు. నియంత్రణకు కృషి చేస్తున్నామని తెలిపారు.
…………………………………….