* అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై ట్వీట్
ఆకేరు న్యూస్ డెస్క్ : రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్బంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా(AMITHSHA)మాట్లాడుతూ.. అంబేడ్కర్.. అంబేడ్కర్.. అని అనడం ఫ్యాషన్ అయిందని, అలా దేవుడి పేరు స్మరించి ఉంటే స్వర్గానికి చేరుకునేవారని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. పలువురు అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తమిళ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) కూడా దీనిపై స్పదించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు.
కొంతమందికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు అంటే గిట్టదు అంటూ విమర్శలు చేశారు. అంబేద్కర్ భారత పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. సామాజిక న్యాయానికి ప్రతీక. అంబేడ్కర్(AMBEDKAR).. అంబేడ్కర్.. అంబేడ్కర్ అని ఆయన పేరు అంటే మనసు సంతోషంగా ఉంటుందని తెలిపారు. విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
………………………………..