* డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు 48 గంటల నిరసన
* వంటావార్పు చేసి కార్యాలయం ముందే నిద్రపోయిన ఏఎన్ఎంలు
* పరీక్ష లేకుండా రెగ్యులర్గా నియమించాలి
ఆకేరున్యూస్, హనుమకొండ: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఈ.సీ.ఎ ఎన్. ఎంలు, ఆర్బన్ హెల్త్ సెంటర్స్ ఏ.ఎన్.ఎంలు, వైద్య విధాన పరిషత్ ఏఎన్ఎంలు, హెచ్.ఆర్డి ఏఎన్ఎంలు ఇతర అన్ని రకాల ఏ.ఎన్.ఎంలను రాత పరీక్ష లేకుండ యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వరంగల్ లోని డి ఎం హెచ్ ఓ కార్యాలయాల ముందు 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా వంట వార్పు చేసి కార్యాలయం ముందు నిద్రపోవడం జరుగుతుంది,అందులో భాగంగా హనుమకొండ,వరంగల్ జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నేత, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ తెలిపారు. గురువారం రోజున తెలంగాణ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు వరంగల్ లోని డి ఎం హెచ్ ఓ కార్యాలయం ముందు జరిగిన 48 గంటల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న యాద నాయక్, జే సుధాకర్ మాట్లాడుతూ… వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏ.ఎన్.ఎంలు 24 సంవత్సరాల నుండి రెగ్యులర్ కాకపోవడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు,గత 24 సంవత్సరాలుగా సమస్యల పరిష్కారానికి వివిధ రూపాల్లో ఆందోళన పోరాటాలు,నిరవధిక సమ్మెలు చేసిన ప్రభుత్వం నేటికీ రెగ్యులర్ చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
గతంలో సమ్మె సందర్భంగా ఏఎన్ఎంల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్రప్రభుత్వం తేది:02-09-2023న ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని,ఈ కమిటీ ఏఎన్ఎంలతో చర్చించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఉన్న ఆ కమిటీ రిపోర్ట్ లేకుండ రాత పరీక్ష తేదీ ప్రకటించడం వెనుకాల ఉన్న అంతర్యామేమిటని అన్నారు,రాత పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్రవ్యాప్తంగాకాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న 6,500 మంది ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారని అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని 33 జిల్లాల ముందు 48 గంటల నిరసన కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నట్లు యాద నాయక్ తెలిపారు,ప్రభుత్వం బేషజాలకు పోకుండా వెంటనే రాత పరీక్షను వాయిదా వేయాలని లేనియెడల నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సంఘాల పోరాట కమిటీ నాయకులు జే సుధాకర్, శ్రీనివాస్, సుజాత,సరోజ చంద్రకళ,ప్రభావతి, సాంబలక్ష్మి,మంజుల,పుష్పలత,విజయ కవిత, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..