* అసెంబ్లీలో చర్చించే ధైర్యం లేక కేటీఆర్‌పై అక్రమ కేసులు
* ఎమ్మెల్సీ కవిత
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న అక్రమ కేసుల డ్రామాను
ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని కవిత పేర్కొన్నారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదన్నారు. పోరాటాలు మాకు కొత్త కాదు.. అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరని కవిత పేర్కొన్నారు.
……………………………………..