అకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా(Nellore District)లో జికా వైరస్ లేదని డీఎంఅండ్ హెచ్ఓ నిర్ధారించారు. వెంకటాపురంలో బాలుడికి వైరస్ సోకలేదని తెలిపారు. ఆరేళ్ల బాలుడు అస్వస్థతకు గురికావడంతో పరీక్షించిన వైద్యులు జికా వైరస్(Zika Virus) సోకినట్లు అనుమానించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి తమిళనాడులోని ల్యాబ్‌కు పంపించారు. ఇప్పుడు తాజాగా వెంకటాపురం బాలుడికి జికా వైరస్ సోకలేదని నిర్దారించారు. ఈమేరకు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించిందని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు.
రక్త నమూనాలను సేకరించి లేబోరేటరీలో పరీక్షలు జరిపామన్నారు. జికా వైరస్ కాదని తేలిందని, పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి వివరాలు రావాల్సి ఉందని వెల్లడించారు.
……………………………………….