* లోక్సభలో తీర్మానం ఆమోదం
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఒకేసారి లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై రూపొందిన జమిలి బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని శుక్రవారం లోక్సభ తీర్మానం పాస్ చేసింది. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు రెండు బిల్లులను జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాగా.. పార్లమెంటరీ స్థాయి సంఘంలో ఉండే సభ్యుల వివరాలను పంపించాలని రాజ్యసభను మంత్రి కోరారు. సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం కమిటీలో మొత్తం 39 మంది ఎంపీలు ఉంటారు. దాంట్లో 27 మంది లోక్సభ, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పీపీ చౌదరీ, ప్రియాంకా గాంధీలు లోక్సభ నుంచి ఆ కమిటీలో ఉన్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులపై జేపీసీలో చర్చిస్తారు. ఓ బిల్లు కోసం మాత్రం రాజ్యాంగ సవరణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
…………………………………….