* ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఆకేరున్యూస్, అమరావతి: కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు. అమిత్ షా రాజీనామా చేసి, క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పార్లమెంట్ లోపలికి వెళితే బీజేపీ ఎంపీలు అడ్డుకుని పక్కకు తోయడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ తోపులాటలో మల్లికార్జున ఖర్గే కిందపడిపోయారని.. బీజేపీ ఎంపీలు వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీపై నింద మోపుతున్నారని ఆరోపించారు. వారి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలు ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని, అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల వీడియోను డిలీట్ చేయాలంటూ ‘ఎక్స్’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాషాయం మూకపై పోరాటం చేస్తూనే ఉంటుందని వెల్లడిరచారు.
……………………………………