* వాడీవేడి చర్చ అనంతరం సభ తీర్మానం
* ధరణిపై సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు – 2024 ఆమోదం పొందింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భూ భారతి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని.. బిల్లు ఆమోదం పొందుతుండటంతో ఆనందభాష్పాలు వస్తున్నాయన్నారు. సభలో భూ భారతి బిల్లు ప్రవేశ పెట్టిన అనంతరం బిల్లును పాస్ చేయాల్సిందిగా స్పీకర్ను కోరారు. సభ్యులు ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం అసెంబ్లీని స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు. కాగా, భూభారతిపై వాడీవేడిగా చర్చ సాగింది. బిల్లుపై విపక్ష బిఆర్ఎస్ సభ్యులు చర్చించకుండా ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించాలన్నారు. భూముల అన్యాక్రాంతం, లక్షల కోట్ల అవినీతి జరిగిందని డిప్యూటి సిఎం భట్టి, మంత్రి పొంగులేటి ప్రకటించినా ఎందుకు సిబిఐ విచారణకు ఆదేశించలేదని బిజెపి నేతమహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
…………………………………………..