* అభిమానులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్
ఆకేరున్యూస్, అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో పర్యటించి రోడ్లు లేక ఇబ్బంది పడుతున్న గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 9 గ్రామాల్లో సుమారు 50 కోట్లతో రహదారుల నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కాగా, పవన్ కళ్యాణ్‌ను చూడడానికి అభిమానులు పెద్దఎత్తున్న తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అభిమానులను నేను కోరేది ఒక్కటే. దయచేసి నన్ను నా పని చేసుకోనివ్వండి. నేను బయటికి వచ్చినప్పుడు మీరు నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేనన్నారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దామంటే అందరూ ఇక్కడే ఉండడంతో ఏం కనిపించట్లేదన్నారు. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవని.. నేను పనిచేస్తే మీ ఫ్యూచర్‌కి మంచి జరుగుతుందని అభిమానులకు పవన్ రిక్వెస్ట్ చేశాడు.
…………………………………….