* రాష్ట్రంలో 95 శాతం చిన్న.. సన్నకారు రైతులే
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రైతుబంధుపై అబద్ధాలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వందల ఎకరాలున్న రైతులకు, పెద్ద రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చామని దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ బుడుగు, బలహీన వర్గాల రాష్ట్రం. నూటికి 95 శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 91.33 శాతం మంది లబ్ధిదారులు 5 ఎకరాలు అంతకంటే తక్కువ ఉన్నవారే ఉన్నారు. 7.28 శాతం మంది 5 నుంచి 10 ఎకరాల మధ్య ఉన్నవారు ఉన్నారని, పదెకరాల పైన ఉన్నవారు కేవలం 1.39 శాతమని, 25 ఎకరాలున్నవారు 0.9 శాతం అని వివరాలు వెల్లడిరచారు. రూ.72 వేల కోట్ల రైతుబంధులో పెద్ద రైతులకు ఇచ్చింది 1.39 శాతం మాత్రమేనని వెల్లడిరచారు. 80 శాతం మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారు. అందులో బీసీలు 54 శాతం, ఎస్సీలు 13 శాతం, ఎస్టీలు 13 శాతం ఉన్నారు. 70 శాతం రైతుబంధు పైసలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయన్నారు.
…………………………………….