వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో తొలి ధ్యాన దినోత్సవం జరుపుకున్న వరంగల్ పోలీసులు
ఆకేరున్యూస్, వరంగల్: ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు పోలీస్ అధికారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో తొలి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గోన్నారు. నిత్య ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చని ఏసీపీ నాగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ శ్రీధర్, మెడిటేషన్ ట్రైనర్ సునీత తో పాటు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
…………………………………………