
* అదుపుతప్పి కారుపై పడ్డ భారీ కంటెయినర్
* ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం
ఆకేరు న్యూస్ డెస్క్ : బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి భారీ కంటెయినర్ ఓ కారుపై పడడంతో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బెంగళూరు తాలెకెరె ప్రాంతంలో రెండు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ ట్రక్కు పక్కనే ఉన్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటి? అనేది ఆరా తీస్తున్నారు. చనిపోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………….