* సర్కారుపై కేటీఆర్ విమర్శలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రైతుబంధుపై సబ్ కమిటీ వేసింది రైతుబంధు ఎగ్గొట్టేందుకేనని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019లో రైతుబంధు స్టార్ట్ అయ్యాక 2019లో 499, 2020లో 471, 2021లో 359, 2022లో కేవలం 178 రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఇది రైతుబంధు, రైతుబీమా ప్రభావం కాదా? పెరిగిన వ్యవసాయ విస్తరణ ఫలితం కాదా? అందుబాటులోకి వచ్చిన చెరువులు, కాళేశ్వరం ప్రాజెక్టులతో స్థిరీకరించబడ్డ సాగు కాదా? వ్యవసాయం కాదా? ఇది ప్రామాణికం కాదా?’ అంటూ నిలదీశారు. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు.. వర్తమానం తెల్వదు. లెక్కలు అంతకన్నా తెల్వదన్నారు. ఒక సంవత్సరంలో రూ.20వేలకోట్లు రుణమాఫీకి ఇచ్చామంటున్నాడని.. కేవలం ఇచ్చింది లెక్కగడితే రూ.12వేలకోట్లు దాటదన్నారు. కానీ, అదే మా ప్రభుత్వం పదేళ్లలో రూ.28వేలకోట్ల రుణమాఫీ రెండు దఫాల్లో… మరో వైపు రూ.73వేలకోట్ల రైతుబంధు. ఈ రెండు కలిపితే రైతుల ఖాతాల్లో పైసలు లెక్కపెడితే రూ.లక్ష కోట్లు దాటిందని పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం… సబ్ కమిటీ వేసిందే రైతుబంధు ఎగ్గొట్టేందుకేనన్నారు.
…………………………………