* సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: అల్లు అర్జున్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై హరీశ్‌రావు స్పందించి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనను తాము సమర్థించడం లేదని తెలిపారు. అక్కడ ఒక మహిళ చనిపోవడాన్ని బీఆర్ఎస్ ఖండిస్తుందని పేర్కొన్నారు. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లెలో సాయిరెడ్డి అనే మాజీ సర్పంచ్.. నీ తమ్ముడి వాళ్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాస్తే అతన్ని ఎందుకు అరెస్టు చేయవని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నాడని విమర్శలు చేశారు.
…………………………………………