* బీజేపీ అభ్యర్థి కేరళ హైకోర్టులో పిటిషన్
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: వాయనాడ్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ అక్రమంగా గెలిచారని కేరళ హైకోర్టులో పిటీషన్ వేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో తేడాలు ఉన్నాయని, ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పిటిషన్లో సవాల్ చేశారు. అంతేగాక ప్రియాంకాగాంధీ ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. అయితే డిసెంబర్ 23 నుంచి జనవరి 5 వరకు కేరళ హైకోర్టుకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. సెలవుల అనంతరమే న్యవ పిటిషన్ను న్యాయస్థానం విచారించనుంది. వాయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ దాదాపు 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అక్రమాలకు పాల్పడటం వల్లే ప్రియాంకాగాంధీ గెలిచారని నవ్య ఆరోపిస్తున్నారు. ఓటర్లను తప్పుదోవ పట్టించారని అన్నారు.
…………………………………………