* దేశం మొత్తం ఇటువైపు చూసేలా కృషి
* బ్యాంకర్లతో సమావేశంలో ఆర్థిక మంత్రి భట్టి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ(VIBRANT TELANGANA)ను చూస్తారని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (FINANCIAL MINISTER BATTI VIKRAMARKA)అన్నారు. ప్రజాభవన్లో ఆయన బ్యాంకర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కాంగ్రెస్ పాలన ఉండబోతుందని చెప్పారు. ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధిపనులు చేపడతామన్నారు. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు (REGIONAL RING ROAD)పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు వివరించారు. వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు వివరించారు. వ్యవసాయం, సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వానికి బ్యాంకర్లు(BANKERS) సహకరించాలని కోరారు. వ్యవయసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని ఆదేశించారు.
………………………………