* నేటి నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ విధుల్లోకి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ట్రాన్స్ జెండర్స్(TRANSJENDORS) ను ట్రాఫిక్ విధుల్లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు పోలీసు శాఖ పలువురిని సెలెక్ట్ చేసి.. వారికి శిక్షణ ఇచ్చింది. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్స్ హైదరాబాద్ ట్రాఫిక్ (HYDERABAD TRAFFIC) విభాగంలో నేటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకున్న 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహణకు సంబంధించిన ట్రాఫిక్ గుర్తులతోపాటు డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు.
కుటుంబం, సమాజంలో ట్రాన్స్ జెండర్స్ ఎంతో వివక్షకు గురువుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని..వారిని సమాజంలో అనుసంధానం చేయాలన్న ఉద్దేశ్యంతోనే మొదటిసారిగా వారికి తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ విభాగంలో హోంగార్డు క్యాడర్ (HOMEGUARD CADER)కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ కు సరైన అవకాశాలు లేకపోవడం వల్లే డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారని, గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చారని తెలిపారు. ఈమేరకు నేటి నుంచి వారు ట్రాఫిక్ విధుల్లో చేరారు. వారికి సీపీ సీవీ ఆనంద్ (CV ANAND)అభినందనలు తెలిపారు.
……………………………………….