* కీలక ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం
* స్టేషన్ బయట అరవింద్ పడిగాపులు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ విచారణ మూడు గంటలకు పైగానే సాగింది. ఉదయం 11.5 గంటలకు పోలీసుల ముందుకు హాజరైన బన్నీ.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంకా విచారణకు సహకరిస్తూనే ఉన్నారు. పోలీసులు 20 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు రాబడుతున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన నోట్ బన్నీకి ఇచ్చినట్లు సమాచారం. ముందస్తుగా చిక్కడప్లల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
బన్నీని పోలీసులు అడిగిన ప్రశ్నల్లో ఇవి ఉన్నట్లుగా తెలుస్తోంది…
1. సంథ్య థియేటర్ కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు?
2. పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు?
3. పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా? లేదా?
4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
5. మీడియా ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు?
6. అనుమతి లేకుండగా రోడ్ షో ఏవిధంగా నిర్వహించారు?
7. మీ కుటుంబసభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
8. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించినవారు?
9. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
10. ఫ్యాన్స్, పోలీసులపై దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?
11. 850 మీటర్లు రోడ్ షో ఎందుకు చేశారు?
12. ఏసీపీ, సీఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? వంటి 20 వరకు ప్రశ్నలకు సంబంధించి బన్నీ నుంచి సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు సమాచారం. కాగా, లోపల బయట అర్జున్ విచారణ కొనసాగుతుండగా, స్టేషన్ బయట అరవింద్, అల్లు మామ చాలాసేపు పడిగాపులు కాశారు.
……………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
