
* ఉత్తర్వులు జారీ చేసిన ఐఅండ్పీఆర్ కమిషనర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మీడియా అక్రిడేషన్ కార్డుల గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మరో మూడు నెలల (2025 మార్చి 31) వరకు అక్రిడేషన్ కార్డుల గడువును పొడగిస్తూ రాష్ట్ర సమాచారా పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత మూడు నెలల కిందటనే గడువు ముగిసినప్పటికీ 2024 డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పెంచిన సంగతి విధితమే. అయితే ప్రభుత్వం అక్రిడేషన్ కార్డుల జారీపై నూతన మార్గదర్శకాలు రూపొందిస్తున్న నేపథ్యంలోనే తాజాగా మరో మూడు నెలల వరకు కార్డుల కాలపరిమితిని పొడగిస్తున్నట్లు కమిషనర్ తన ఉత్తర్వులలో పేర్కొన్నారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కమిషనర్ తెలిపారు.
…………………………………..