* సంథ్య థియేటర్ వివాదానికి తెరపడేనా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పుష్ప-2 సినిమాను వీక్షించేందుకు అల్లు అర్జున్ (Alli Arjun) వచ్చిన సందర్భంలో సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవంతి కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారాన్ని ప్రకటించారు. కిమ్స్ ఆస్పత్రి(Kims Hospital)లో చికిత్స పొందుతున్న శ్రీతేజ(Sri Teja)ను ఈరోజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravindh) పరామర్శించారు. వారి కుటుంబానికి రూ.2 కోట్ల అందించనున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.కోటి, మైత్రీ మూవీస్ నిర్మాతలు రూ.50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షల చెక్కులను దిల్ రాజుకు అందించారు. నిన్న కిమ్స్ ఆస్పత్రికి వచ్చిన దిల్ రాజు(Dil Raju) మాట్లాడుతూ.. త్వరలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేలా ప్రయత్నిస్తానని తెలిపారు.
త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు మూడున్నర గంటల పాటు విచారించారు. పలు వీడియోలు ఆయనకు చూపించి వివరణ అడిగారు. ఈక్రమంలో బన్నీ భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. తప్పయిపోయిందని పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈరోజు దిల్ రాజు, అల్లు అరవింద్ కిమ్స్ (Kims)ఆస్పత్రిలో శ్రీతేజను పరామర్శించి రూ. 2 కోట్ల పరిహారాన్ని ప్రకటించారు. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా.. లేదా అనేది చూడాలి. కాగా, శ్రీతేజ వేగంగా కోలుకుంటున్నాడని, 72 గంటలుగా వెంటిలేటర్ లేకుండానే చికిత్స పొందుతున్నాడని దిల్ రాజు తెలిపారు.
…………………………………………………