
* హిమాన్షు పాటకు కేటీఆర్ ఫిదా
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను ఇప్పటికే చాటుకున్నాడు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హిమాన్షు.. గత ఏడాది ఓ ఇంగ్లీష్ సాంగ్ గోల్డెన్ అవర్ ఆలపించి అందర్నీ మెప్పించాడు. తాజాగా తన తండ్రి పట్ల తనకు ఉన్న ప్రేమ, అభిమానాలను చాటుతూ హిమాన్షు రావు ఒక పాటను పాడాడు. నిజానికి కేటీఆర్ బర్త్ డే కానుకగా జూలైలోనే హిమాన్షు ఓ పాటను పాడాడు. యానిమల్ మూవీలోని ఓ నాన్న నువ్వు నా ప్రాణం అనే పాటను రికార్డు చేశాడు. అయితే ఆ పాటను తాజాగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తన బర్త్ డే కానుకగా తన కొడుకు హిమాన్షు రావు ఈ పాటను పాడాడని పేర్కొన్నారు. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని చెప్పారు. అయితే ఆ పాటను తాను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు గానం, పాటలోని సాహిత్యం అద్భుతంగా ఉందని తెలిపారు.
…………………………………………………………………….