ఆకేరు న్యూస్, పెద్దపల్లి : విద్యార్థులు అందరూ కంప్యూటర్లతో కుస్తీ పడుతున్నారు. ల్యాబ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి కత్తులతో వచ్చి కలకలం సృష్టించాడు. గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజీ(Godvaraikani Government Jr College)లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తులు, తల్వార్లతో రెచ్చిపోయాడు. కంప్యూటర్ ల్యాబ్(Computer Lab)లో పని చేస్తున్న ఉద్యోగి శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి పొడిచాడు. ఈ ఘటనతో అక్కడే ఉన్న విద్యార్థులు అందరూ నిర్ఘాంతపోయారు. భయంతో పరుగులు పెట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఉద్యోగిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
