* 15 రోజుల ముందుగానే రత్నాచల్ ఎక్స్ ప్రెస్
* మరిన్ని రైళ్ల వేళ్లలోనూ మార్పులు
* నేటి నుంచి దక్షిణమధ్య రైల్వే కొత్త టైం టేబుల్ అమల్లోకి
ఆకేరు న్యూస్ డెస్క్ : రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి.. కొత్త సంవత్సరంలో ప్రయాణం చేయబోయే ముందు ఈ విషయం గమనించండి. రైలు వేళలు మారాయి. నూతన సంవత్సరం(New Year) సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి టైం టేబుల్ అమల్లోకి రాబోతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు రైల్వే సర్వీసులను మెరుగుపరిచేందుకు రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు చేసినట్టు తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ లో ఈ వివరాలను రైల్వేశాఖ ఉంచింది. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ (www.irctc.co.in), నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ పోర్టల్లో మారిన వేళలను పొందుపరిచారు. ఉదాహరణకు విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్ ప్రెస్(Ratnachal Express).. ఇక నుంచి విజయవాడ స్టేషన్లో 15 నిమిషాల ముందుగానే బయలుదేరుతుంది. అలాగే.. ఎంఎంటీఎస్ రైలు వేళల్లోనూ.. మార్పులు జరిగాయి.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
