ఆకేరు న్యూస్ డెస్క్ : పబ్జీ గేమ్ ముగ్గురు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. పట్టాలపై కూర్చుని పబ్జీ (Pubji) ఆడుతున్న ముగ్గురిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బిహార్(Bihar) లో ఈ ఘటన జరిగింది. ఫర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా ముగ్గురూ స్నేహితులు. బిహార్ లోని రైలు పట్టాలపై పబ్జీ ఆడుతున్నారు. చెవుల్లో ఇయర్ బడ్స్ (Ear Buds)పెట్టుకుని పబ్జీ గేమ్ లో మునిగిపోయారు. లోకో పైలట్ హారన్ కొట్టినా వినిపించుకోలేదు. దీంతో రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీనివల్ల మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
………………………………………