* ఇప్పటికే చైనాలో కలకలం
ఆకేరు న్యూస్ డెస్క్ : కరోనా సృష్టించిన విలయం మరచిపోవాలన్నా మరచిపోలేనిది. ప్రపంచం మొత్తం కొవిడ్ (Covid)తో అల్లకల్లోలమైంది. భారత్ పై కూడా ఆ ప్రభావం చూపింది. ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ చాలామందిని బలిగొంది. ఆ వైరస్ పుట్టిల్లు చైనా(Chaina). ఇప్పుడు అదే చైనాలో మరో వైరస్ వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ మళ్లీ కొవిడ్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆస్పత్రుల ముందు జనం క్యూ కడుతున్నారు. ఎవరిని చూసినా మాస్క్ లతో కనిపిస్తున్నారు. దీంతో చైనాలో మరోసారి కొత్త వైరస్ (New Virus) వ్యాపించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వైరస్.. ప్రపంచమంతా వ్యాపించనుందా.. అనే చర్చ మొదలైంది. ఆ కొత్త వైరస్ పేరు హెచ్ఎంపివి (HMPV). చైనాలో ప్రస్తుతం ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. హెచ్ఎంపివి అంటే మైకోప్లాస్మా న్యుమోనియా వైరస్. ఇది కూడా గాలి ద్వారా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ పిల్లలు, వృద్ధులకు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితులు ఉన్న వారు దీని బారిన పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే.., దీనిపై డబ్ల్యూహెచ్ఓ (WHO)మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు.
………………………………….