![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/CEC-Rajiv-Kumar-1_V_jpg-816x480-4g.webp)
* చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా త్వరలోనే పదవీకాలం ముగియబోతుంది
* రాజీవ్‌కుమార్
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని వ్యాఖ్యానించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా త్వరలోనే పదవీకాలం ముగియబోతుందని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనుండగా.. విలేకరుల సమావేశంలో ఈవీఎంలతో పాటు అదనపు ఓట్ల వరకు ఎన్నికల కమిషన్‌పై వచ్చిన ఆరోపణలపై వచ్చిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
రాజీవ్‌కుమార్ 15 మే 2024న రాజీవ్‌కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. సెప్టెంబర్ 1 సెప్టెంబర్ 2020 నుంచి ఎన్నికల కమిషన్‌గా ఎన్నికల సంఘంతో అనుబంధం ఉంది. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో 2020లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. కోవిడ్ సమయంలోనూ ఉత్తరప్రదేశ్ సహా మహారాష్ట్ర, హర్యానా, జార?ండ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. అలాగే, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను రాజీవ్ కుమార్ హయాంలోనే జరిగాయి.
…………………………………………………..