* ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తగ్గేది లేదంటున్న ప్రభుత్వం
* కేటీఆర్కు ముందే పిటిషన్ దాఖలు చేయడంతో ఖంగు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ప్రభుత్వం తగ్గేది లేదంటూ సుప్రీంకోర్టులో కెవియేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ఆశ్రయించింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది… ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. అరెస్ట్ చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని కేటీఆర్ తరపు న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అందరికి ’రూల్ ఆఫ్ లా’ వర్తిస్తుందని కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు గుర్తుచేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.
…………………………….