![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/IMG_20250107_181938-e1736260336344-1024x650.jpg)
* ఖమ్మం జిల్లాలో పర్యటించి జమలాపురం అటవీపార్క్ కు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, ఖమ్మం: ఇండియా టూరీజం మ్యాపులో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం కల్పించేలా పర్యాటకంగా మండలాన్ని అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించి రూ.5 కోట్ల 83 లక్షలతో చేపట్టిన జమలాపురం అటవీ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ,.. చాలా సంవత్సరాల నుంచి జమలాపురం దేవాలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజలు ఆకాంక్షించారని, దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో జమలాపురం చెరువు ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసుకున్నామని, చెరువు కట్ట మీద రోడ్డు వెడల్పు చేసుకుని, గుట్ట మధ్య నుంచి రేమిడిచెర్ల వరకు రోడ్డు వేసుకున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జమలాపురం చెరువు, పక్కన కాటేజ్ కోసం పర్యాటక శాఖచే ప్రణాళికలు తయారు చేశామని అన్నారు. అటవీ శాఖ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
………………………………….