* సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం విధితమే. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు.
ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. కాగా.. రూ.50 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. పదేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినప్పటి నుండి రేవంత్ రెడ్డి పాస్‌పోర్ట్ ఏసీబీ కోర్టులోనే ఉంది. ఎప్పుడన్నా విదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేకంగా పిటిషన్ వేసి ఆ పాస్‌పోర్టును కోర్టు నుండి తీసుకోవాలి. పర్యటన అయిపోగానే మళ్లీ ఏసీబీ కోర్టులో సమర్పించాలి.
…………………………………….