* రైతు మహా ధర్నాకు అనుమతి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ భారీ రైతు మహా ధర్నా నిర్వహించేందుకు సిద్ధం కాగా.. పోలీసులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 21న నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రైతు మహా ధర్నాను నిర్వహించాలని.. ముందుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధం కాగా.. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ వర్గాలు తెలంగాణ హైకోర్టుకు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈనెల 28న రైతు మహా ధర్నా నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్కు అనుమతి ఇచ్చింది. 28వన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు మహా ధర్నా నిర్వహించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది.
……………………….