* పుష్పాంజలి ఘటించిన గవర్నర్, సీఎం
ఆకేరున్యూస్, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ వద్ద ఆ మహనీయుడికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సర్వమత ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు మహాత్ముడికి నివాళులు అర్పించారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
