* నోటీసులు పంపిన శాసనసభ కార్యదర్శి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్(Congress)లో చేరిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల(Brs Mlas)కు షాక్ తగిలింది. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు పంపారు. బీఆర్ ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు పంపారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు పంపిన నోటీసులో కోరారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు. 2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేందర్(Danam Nagendar), కడియం శ్రీహరి(Kadiyam Srihari), కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ(Arekapudi Gandhi) కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు బీఆర్ ఎస్ ఫిర్యాదు చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టు, సుప్రీంకోర్టు(Suprim Court)ను ఆశ్రయించింది. దీనిపై నిన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ తరుణంలోనే అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.
………………………………………….