* జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు
ఆకేరు న్యూస్, డెస్క్ : జర్నలిస్ట్‌పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు (Mohan Babu)కు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court)లో గురువారం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై పహాడీషరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత గాయపడ్డ జర్నలిస్ట్‌కు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
………………………………..