![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/eac4fe8f-0a8a-4953-95ec-3e96c18a611b-1024x576.jpg)
– రహదారిపై టిఫిన్ చేస్తూ వినూత్న నిరసన
– నిలిచిపోయిన ట్రాఫిక్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ ను ప్రత్యేక మండలంగా గుర్తించాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రోజువారీగా ఆందోళన చేస్తున్నారు. గురువారం ఉదయం హుజురాబాద్- పరకాల ప్రధాన రహదారిపై భీంపల్లి క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలియజేశారు. రహదారిపైనే కూర్చొని టిఫిన్ చేసారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై నల్ల బాడ్జీలతో బైఠాయించి, ఆందోళన చేపట్టారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమింప చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఎర్రబెల్లి సంపత్ రావు,మాజీ జెడ్పీటీసీ మారపెల్లి నవీన్,మాజీ సర్పంచ్ ర్యాకం మొండయ్య, మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి దేవేందర్ రావు,జక్కుల రాజు, భాస్కర్ , రాజమౌళి,రాణా ప్రతాప్, మేడిపల్లి రాజు,శివ,పొతిరెడ్డి శంకర్,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………