
* వాలంటైన్స్ డే రోజున తీపి కబురు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (Pavan Kalyan Fans)కు వాలంటైన్స్ డేన మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ఆ మేరకు పూర్తి చేసేలా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యం లో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ను పంచుకుంది. కొల్లగొట్టినాదిరో (Kollagottinadhiro) అనే రెండో సింగిల్‌ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వాలంటైన్స్డేను పురస్కరించుకొని కొత్త పోస్టర్‌ను పంచుకుంది. జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
………………………………………………