
* ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలనా?
*గుమ్మడిదలలో డంపింగ్‌యార్డు ప్రతిపాదన విమరమించుకోవాలి
* కోర్టు ఆర్డర్ ఇచ్చినా బుద్ది లేదా?
* గుమ్మడిదలను మరో లఘచర్ల చేయొద్దు..
* ప్రజల ఆందోళనకు మద్దతు తెలిపిన హరీశ్‌రావు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : రాత్రికి రాత్రి పనులు చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంపింగ్ యార్డును నెలకొల్పే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) విమర్శించారు. గుమ్మడిదల డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న ప్రజలకు ఆయన మద్దతు తెలిపారు. తక్షణమే ఈ డంపింగ్ యార్డు(Dumping yard)ను రద్దు చేసి, ప్రజలకు ఇబ్బంది లేకుండా దూరంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అయ్యా.. రేవంత్ రెడ్డి(Revanthreddy)గారూ.. మా గుమ్మడిదలను మరో లఘచర్ల చేయవద్దు.. అని తెలిపారు. ఇప్పటికే పది రోజుల నుంచి రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. తమ ఆరోగ్యాలు, తమ పిల్లల భవిష్యత్ దెబ్బతింటాయని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఊరిలో మంది ఎంత మంది ఉన్నారో, పోలీసోళ్లను అంత మందిని పెట్టారని ఇదేమైనా ఎమర్జెన్సీ (Emergency) రాజ్యమా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఓల్లు వేసి గెలిపిస్తే తమ నెత్తిన డంపింగ్ యార్డు పెడతావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో వివిధ రూపాల్లో మీరు చేస్తున్న పోరాటాన్ని అసెంబ్లీకి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు పెట్టొద్దని ఎయిర్ ఫోర్స్ వాళ్లు కూడా కలెక్టర్‌కు లెటర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఏరకంగా చూసినా ఇక్కడ డంపింగ్ యార్డు పెట్టడం పద్దతి కాదని, మీ టిప్పర్లు, పోలీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆర్డర్ (Court Order) ఇచ్చినా, బుద్ది లేకుండా పనులు చేపడుతున్నారని అన్నారు. ప్రజాభిప్రాయం లేకుండా డంపింగ్ యార్డు పనులు చేపడతున్నారని తెలిపారు.
……………………………………